logo

తెదేపా కార్యకర్తలపై దాడి అమానుషం

రాజకీయ కక్ష ఉంటే నన్నే ఎన్‌కౌంటర్‌ చేయండి కానీ తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో పెద్దరాజుపాలెంకు చెందిన చెన్నబోయిన సుబ్బరాయుడిపై

Published : 02 Jul 2022 01:56 IST

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి  

పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ

బనగానపల్లి, న్యూస్‌టుడే: రాజకీయ కక్ష ఉంటే నన్నే ఎన్‌కౌంటర్‌ చేయండి కానీ తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో పెద్దరాజుపాలెంకు చెందిన చెన్నబోయిన సుబ్బరాయుడిపై దాడి చేసిన ఎస్సై శంకర్‌నాయక్‌ను సస్పెండు చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి  పోలీస్‌స్టేషన్‌ సమీపంలో కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు.  పొలం విషయంలో సుబ్బరాయుడిని పంచాయితీకి పిలిచి దాడి చేశారన్నారు.  తెదేపా కార్యకర్తల జోలికి రావొద్దు.. కక్ష ఉంటే నన్నే ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు.  దాడి చేసిన ఎస్సైపై కేసు నమోదు చేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇటీవల యర్రగుడిలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ప్రజలపై పోలీసులు కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు.  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సుబ్బరాయుడిని పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని