logo

చంద్రబాబును సీఎం చేసేదాకా విశ్రమించం

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసేవరకు తెదేపా అనుబంధ విభాగాలు విశ్రమించకుండా పనిచేస్తాయని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చిన్నబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు, వాణిజ్య సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ ప్రతిజ్ఞ

Published : 08 Aug 2022 03:31 IST

పాల్గొన్న తెదేపా రాష్ట్ర నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసేవరకు తెదేపా అనుబంధ విభాగాలు విశ్రమించకుండా పనిచేస్తాయని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చిన్నబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు, వాణిజ్య సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ ప్రతిజ్ఞ చేశారు. కర్నూలు జిల్లాకు వచ్చిన వారు ఆదివారం తెదేపా జిల్లా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వైకాపాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనే భేదం లేకుండా ఒకరినిమించి మరొకరు పోటీపడి మరీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోరు మెదపకపోవడం దారుణమన్నారు. మూడున్నరేళ్ల పాలనలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ముఖ్యమంత్రి తన పదవీకాలం పూర్తయ్యేలోగా రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తారని దుయ్యబట్టారు. ఇష్టానుసారంగా ధరలు పెంచేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఈ రాక్షస పాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శులు పి.జి.గోపినాథ్‌ యాదవ్‌, ప్రభాకర్‌ యాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎస్‌.అబ్బాస్‌, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకురాలు సంజీవలక్ష్మి, మహేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని