logo

పంద్రాగస్టుకు పాత దుస్తులే

విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు సకాలంలో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా నేటికీ పూర్తిస్థాయిలో జగనన్న విద్యాకానుక కిట్లు అందలేదు. కొంత మంది విద్యార్థులకు అరకొరగా దుస్తులు అందినప్పటికీ కుట్టు కూలీ ఇవ్వకపోవడంతో వాటిని కుట్టించుకోలేని

Published : 13 Aug 2022 00:39 IST

కర్నూలు విద్యా విభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు సకాలంలో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా నేటికీ పూర్తిస్థాయిలో జగనన్న విద్యాకానుక కిట్లు అందలేదు. కొంత మంది విద్యార్థులకు అరకొరగా దుస్తులు అందినప్పటికీ కుట్టు కూలీ ఇవ్వకపోవడంతో వాటిని కుట్టించుకోలేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఫలితంగా పంద్రాగస్టు రోజున పాఠశాలకు కొత్త దుస్తులు వేసుకోలేని పరిస్థితి. గతంలో ఇచ్చిన దుస్తులకే కుట్టు కూలీ ఇంతవరకు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

కోవెలకుంట్ల: మండల పరిషత్‌ ప్రాథమిక (మెయిన్‌) పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉండగా నలుగురికే ఇవ్వడం గమనార్హం.

ఆత్మకూరు: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందలేదు. ఇక్కడ ఆరులో 160, తొమ్మిదిలో 180 మందికి పైగా విద్యార్థులకు దుస్తులు అందలేదు. తొమ్మిదో తరగతిలో 20 మందికే ఇవ్వడం గమనార్హం.

ఆలూరు: ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 470 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి విడతగా 200 మందికి ఏకరూప దుస్తులు అందించారు.

కోడుమూరు పట్టణం: కొండపేట ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతులకు చెందిన విద్యార్థులు 106 మంది వరకు ఉన్నారు. వీరిలో 25 శాతం మందికే ఏకరూప దస్తులు వచ్చాయి. మిగిలిన వారు పాత దుస్తులతోనే బడికి వస్తున్నారు.

బనగానపల్లి: కొండపేట ప్రాథమిక పాఠశాలలో మొత్తం 252 మంది విద్యార్థులున్నారు. ఒకటి, రెండు తరగతికి చెందిన 83 మందికి ఇప్పటి వరకు దుస్తులు అందించలేదు

ఎక్కడెక్కడ ఎలా ఉందంటే

* కర్నూలు జిల్లాలోని 151 స్కూల్‌ కాంప్లెక్సుల్లో 2,97,044 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెల దాటినా నేటికీ కేవలం 62 శాతం పంపిణీ పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు.

* కర్నూలు జిల్లా పరిధిలో 25 మండలాలకు అరకొరగా కేటాయించగా.. పత్తికొండతోపాటు ఎమ్మిగనూరు మండలానికి 4,121, ఆదోని మండలానికి 4,638 ఏకరూప దుస్తులు ఎక్కువగా వెళ్లినట్లు అధికారులు లెక్కల్లో తేల్చారు. అయినప్పటికీ వీటిని వేరే మండలాలకు కేటాయించకపోవడం గమనార్హం. కౌతాళం, మద్దికెర, నందవరం, పెద్దకడబూరు, తుగ్గలి, వెల్దుర్తి మండలాలకు వెయ్యి లోపే ఏకరూప దుస్తులు అందినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని