logo

రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ విశిష్టతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

Published : 27 Nov 2022 02:34 IST

ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాజ్యాంగ విశిష్టతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే రాజ్యాంగం లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు, చట్టాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్‌    కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు.

* నగరంలోని జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పీఠికను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు. అదనపు జడ్జిలు ప్రతిభాదేవి, పాండురంగారెడ్డి, భూపాల్‌రెడ్డి, సీబీఐ కోర్టు జడ్జి వెంకట రమణ, అనిశా కోర్టు న్యాయమూర్తి సునీత, సబ్‌ జడ్జిలు సీహెచ్‌ వెంకట నాగశ్రీనివాసరావు, కేశవ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు డి.షర్మిల, జ్యోత్స్నాదేవి, భార్గవి, దివ్య, వందన పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, న్యాయవిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని