logo

చిన్నారుల చికిత్సలు కాదు.. ఆధార్‌ అవస్థలు

ఆదోని పట్టణంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా పూర్తవటం లేదు.

Published : 30 May 2023 02:56 IST

కేంద్రం ఎదుట చిన్నారులతో జనం పడిగాపులు

ఆదోని పట్టణంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా పూర్తవటం లేదు. సచివాలయాల్లో ఆధార్‌ సేవలు కల్పించాల్సి ఉన్నా.. ఏఏ కేంద్రంలో ఈ సౌకర్యం తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. తెలిసిన కేంద్రాలకే వెళ్తుండటంతో వేచి ఉండక తప్పం లేదు. అసలే వేసవి కాలం ఆపై ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు చిన్నారుల తల్లుల బాధలు వర్ణనాతీతం. చుట్టుపక్కల మండలాల నుంచి సైతం జనం వస్తుండటంతో కేంద్రాల నిర్వాహకులు సైతం చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సేవలు విస్తరించి, వేగంగా అందించేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని