ఉపాధికి సోపానం.. శిక్షణతో సాకారం
యువత, మహిళల అభివృద్ధితో దేశప్రగతికి బాటలు పడతాయి. వారిని స్వయం ఉపాధి మార్గాల్లో ప్రోత్సహిస్తే ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో యువతకు పలు రంగాల్లో తర్ఫీదునిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
మోటారు వైండింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న యువకులు
యువత, మహిళల అభివృద్ధితో దేశప్రగతికి బాటలు పడతాయి. వారిని స్వయం ఉపాధి మార్గాల్లో ప్రోత్సహిస్తే ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో యువతకు పలు రంగాల్లో తర్ఫీదునిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారికి తగిన ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువత, మహిళలకు ప్రతినెలా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టైలరింగ్, మగ్గం వర్క్, చరవాణి మరమ్మతులు, మోటార్ వైండింగ్‌లో శిక్షణ అందిస్తున్నారు.
న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ
యువకులకు ప్రోత్సాహం
కర్నూలు నగరంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 2003 ఆగస్టులో ఈ సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా గ్రామీణ ప్రాంతవాసులకు ప్రత్యేకంగా తర్ఫీదునిస్తున్నారు. వందల సంఖ్యలో యువతకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించారు. యువతీయువకులకు, మహిళలకు శిక్షణ ఇచ్చి ఆర్థిక పురోగతి సాధించేలా దారి చూపుతున్నారు. శిక్షణ సమయంలో భోజనం, ఉచిత వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, జనపనార సంచుల తయారీలో, యువతకు ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్, చరవాణి, మోటార్ వైండింగ్, ఏసీలు, ద్విచక్రవాహనాల మరమ్మతులు, సీసీ కెమెరాల అమరికపై శిక్షణ ఇస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో మేలో చరవాణి మరమ్మతులు, మోటార్ వైండింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాలకు 60 మంది యువకులు శిక్షణ పొందుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కార్యక్రమం ముగియనుంది. అనంతరం మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శివప్రసాద్ తెలిపారు.
దుకాణం ఏర్పాటు చేసుకుంటా
నేను ఇంటర్ వరకూ చదివాను. సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి వచ్చాను. ఏదైనా చేతి వృత్తిలో శిక్షణ తీసుకుంటే బాగుంటుందని పలువురి సలహాతో ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం నాకు మోటార్ వైండింగ్ పని వచ్చింది. స్వయంగా నేనే పనిచేయగలుగుతున్నాను. శిక్షణ అనంతరం మా ఊర్లో దుకాణం ఏర్పాటు చేసుకుంటా. స్వయంగా సంపాదించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
దేవ, వెల్దుర్తి
చరవాణి మరమ్మతులు నేర్చుకున్నా
నాకు చరవాణుల దుకాణం ఉంది. అయితే దాన్ని మరమ్మతులు చేయడం రాదు. ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని, ఎలాగైనా పని నేర్చుకోవాలని చేరాను. నాకు అర్థమయ్యేలా శిక్షణ ఇచ్చారు. చరవాణిలో హార్డ్, సాఫ్ట్‌వేర్‌లను, డిస్ల్పే, మెయిన్‌బోర్డు, మైక్ మరమ్మతు.. ఇలా పలు రకాల పనులు చేసేలా తర్ఫీదు పొందాను. ఒక నెలలో ఇంత సులువుగా పని నేర్చుకోవడం ఆనందం కలిగించింది.
సుంకన్న, కోడుమూరు
అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు
కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో మోటార్ వైండింగ్‌లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి వచ్చా. ఇక్కడే ఉండి నేర్చుకుంటున్నా. శిక్షణ కాలంలో వసతి, భోజనం ఉచితం. కూలర్, హాఫ్ హెచ్‌పీ మోటార్, ఫ్యాన్ రివైండింగ్, మిక్సీలు, ఎగ్జాస్టడ్ ఫ్యాన్, వన్ హెచ్‌పీ మోటార్ వైండింగ్, ప్యాకింగ్ వంటివి అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు. ఇటువంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి.
కిరణ్, గోస్పాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!