logo

ఆరు మీటర్లున్నాయట.. అమ్మఒడి రాదట

ప్రభుత్వం ఏదో ఓ మెలిక పెట్టి పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేసిన అమ్మఒడి పథకం పొందేందుకు అన్నివిధాలా అర్హతలున్నా..

Published : 29 Jun 2023 03:37 IST

ఆరు విద్యుత్తు మీటర్లు ఉన్నాయని చెబుతున్న ఇల్లు ఇదే

ప్రభుత్వం ఏదో ఓ మెలిక పెట్టి పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేసిన అమ్మఒడి పథకం పొందేందుకు అన్నివిధాలా అర్హతలున్నా.. తమకు మంజూరు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మఒడి కోసం ఆశగా ఎదురు చూసినా చాలా మందికి నిరాశే ఎదురైంది. మద్దికెర మండలం అగ్రహారానికి చెందిన మన్యం లక్ష్మీదేవికి పాత ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఒకే ఒక మీటరు ఉంది. కానీ ఆరు ఉన్నాయంటూ ఆమె కుమార్తె వైష్ణవికి అమ్మఒడి పథకం అందకుండా చేశారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తన కుమార్తెకు గత ఏడాదీ పథకం వర్తించింది. ఇప్పుడు ఏకంగా ఆరు విద్యుత్తు మీటర్లు ఉన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు.. వేరే వారి పేరుపై ఉన్న మీటర్లన్నీ మావే అన్నట్లు చెబుతూ లబ్ధి దక్కకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలున్నా ఇలాంటి మెలికలతో పథకాలు అందకుండా కోత విధిస్తున్నారని వాపోయారు. నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది.. విచారించి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

మన్యం లక్ష్మీదేవి, అగ్రహారం

* ఈ విషయాన్ని మద్దికెర ఎంఈవో రంగస్వామితో ప్రస్తావించగా.. అర్హత ఉండి అమ్మఒడి అందని వారి సమస్య గుర్తించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది అందిన వారికి ఈ విద్యాసంవత్సరం రాకపోవడానికి  కారణాలు గుర్తించి నివేదిక అందిస్తామన్నారు.

మద్దికెర, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని