logo

సచివాలయమా.. వైకాపా కార్యాలయమా

వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యక్రమాలకు వేదికలుగా మార్చుకుంటున్నారు.

Updated : 10 Mar 2024 10:02 IST

పార్టీ కార్యక్రమాలకు వేదిక
సచివాలయంలోనే సిద్ధం సభ

అగ్రహారం సచివాలయంలో సిద్ధం పోస్టర్లతో వైకాపా నాయకులు

మద్దికెర, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యక్రమాలకు వేదికలుగా మార్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని అగ్రహారం గ్రామ సచివాలయంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయాల కన్వీనర్లతో శనివారం ‘సిద్ధం సభ’కు అవగాహన కల్పించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. మద్దికెర, అగ్రహారం, పెరవలి తదితర గ్రామాల్లోని సచివాలయాల్లో నిత్యం వైకాపా నాయకులు పార్టీ సమావేశాలను అక్కడే నిర్వహిస్తూ పంచాయతీ, సచివాలయాల సిబ్బంది విధులకు ఆటంకంగా మారారని స్థానికులు చెబుతున్నారు. ‘‘ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి సంజప్ప దృష్టికి తీసుకువెళ్లగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్వహించరాదని చెప్పారు. సెలవు రోజున సచివాలయ తాళాలు వైకాపా నాయకులకు ఎలా చేరాయో తెలియదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని