logo

తెదేపాతోనే గ్రామాల అభివృద్ధి

గ్రామాలు అభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని తెదేపా మండల నాయకులు కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, నౌనే పాటి చౌదరి, ఎంపీటీసీలు నరసన్న,  రహింతుల్లాలు అన్నారు.

Published : 01 May 2024 17:48 IST

ఆస్పరి: గ్రామాలు అభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని తెదేపా మండల నాయకులు కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, నౌనే పాటి చౌదరి, ఎంపీటీసీలు నరసన్న,  రహింతుల్లాలు అన్నారు. బుధవారం మండల ఇన్‌ఛార్జి అమరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆస్పరి మండలం బనవనూరు, వెంగలాయ దొడ్డి, పుప్పాల దొడ్డి, చెన్నంపల్లి, డి కోటకొండ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. తెదేపా అభ్యర్థి బీ వీరభద్ర గౌడ్‌ను, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును గెలిపించాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు