logo

పెన్షన్‌ కోసం వృద్ధుల అవస్థలు

ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు.

Published : 02 May 2024 15:41 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని 42 వార్డులో మొత్తం 17 వేల మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీరికి రూ.ఐదు కోట్ల దాకా నెలనెలా పెన్షన్ ఇస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో వృద్ధులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. దీంతో చాలామందికి బ్యాంకు ఖాతాలు పనిచేయక ఇబ్బందులు పడ్డారు. నగదు తీసుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో పాటు, వేలిముద్రలు పడక తికమక పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బ్యాంకుల వద్ద పడి కాపులు కాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని