logo

5వ తేదీన నీట్‌

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ‘నీట్‌’ నిర్వహించనున్నారు.

Published : 03 May 2024 03:43 IST

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ‘నీట్‌’ నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ది అథీనా స్కూల్‌, మాంటిస్సోరి ఇండస్‌ పాఠశాల, సంతోష్‌ నగర్‌లోని శ్రీలక్ష్మి ఉన్నత పాఠశాల, సుంకేసుల రోడ్డులోని ఎస్‌టీ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల, రైల్వే స్టేషన్‌ వద్దనున్న కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాల, మదర్‌ థెరిస్సా ఫార్మశీ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగుతుందిన పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే అభ్యర్థులు చేరుకోవాల్సి వస్తుంది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లా పరిధిలో సుమారు 8 వేల మంది విద్యార్థులు నీట్‌ రాసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని