logo

ప్రజల ఆస్తులకు రక్షణ కరవు

జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

Published : 08 May 2024 01:51 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులును కలిసి భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా శబరి మాట్లాడుతూ.. ఈ చట్టంతో ప్రజల ఆస్తులు సులువుగా అన్యాక్రాంతమయ్యే ఆస్కారముందన్నారు. బాధితులు నేరుగా న్యాయస్థానానికి వెళ్లే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నల్ల చట్టాన్ని తీసుకొచ్చిన జగన్‌ ప్రభుత్వానికి మళ్లీ ఓటేయాలలా అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని