logo

గడపకొచ్చిన పోలింగ్‌ కేంద్రం

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలమేరకు హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా జిల్లాలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన మంగళవారం తెలిపారు.

Published : 08 May 2024 01:55 IST

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలమేరకు హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా జిల్లాలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన మంగళవారం తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది ఓటరు ఇళ్లలో ప్రత్యేక ఓటింగ్‌ కంపార్టుమెంట్లు ఏర్పాటుచేసి అసెంబ్లీ, పార్లమెంట్‌కు చెందిన బ్యాలట్‌ పేపర్లు అందజేసి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 415 మంది విభిన్న ప్రతిభావంతులు హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల్లో 382 (92.05 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

85 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు, నడవలేనివారు, మంచానికే పరిమితమైనవారు505 (86.77 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని