logo

అవసరం 46,98,726 వచ్చింది 5,40,752

నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

Published : 18 May 2024 02:51 IST

అరకొరగా చేరిన పాఠ్య పుస్తకాలు
తొలిరోజు అందరికీ ఇవ్వడం కష్టమే

నగరంలోని పుస్తక నిల్వ కేంద్రం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.  1 నుంచి పది తరగతులకు 27 టైటిల్స్‌తో 46,98,726 పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించగా జిల్లాకు ఇప్పటివరకు 5,40,752 పాఠ్య పుస్తకాలు అందాయి. ఇందులో 8, 9, 10వ తరగతికి చెందిన పాఠ్య పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆయా ఎంఈవోలకు చేరనున్నాయి.

తగ్గిన ప్రతిపాదన

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 4,66,836 మంది విద్యార్థులు ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి 1 నుంచి పది వరకు ఉన్న తరగతులకు స్పెల్‌-1 కింద 38,18,504, స్పెల్‌-2 కింద 13,53,517 పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఏడాది మాత్రం 46,98,726 పాఠ్య పుస్తకాలు అవసరమని నివేదిక ఇచ్చారు. గతేడాదికి .. ఈ ఏడాదికి తేడా చూస్తే 4,73,298 పాఠ్య పుస్తకాలు తగ్గాయి.

వచ్చినవీ సగమే

ఆరో తరగతికి సంబంధించి సాంఘిక శాస్త్రం పుస్తకాలే వచ్చాయి. ఏడో తరగతికి హిందీ, తెలుగు పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఎనిమిదో తరగతికి ఇంగ్లిషు, జీవశాస్త్రం, హిందీ, సాంఘిక శాస్త్రం (ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు), గణితం (ఉర్దూ మీడియం) తదితర పుస్తకాలు ఎంఈవోలకు చేరాయి. తొమ్మిదో తరగతికి జీవశాస్త్రం మాత్రమే వచ్చింది. 10వ తరగతికి చెందిన అన్ని సబ్జెక్టులకు వచ్చినప్పటికి అరకొరగా సరఫరా కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని