logo

ఆహారపు గొలుసుతోనే మానవ మనుగడ

ప్రకృతికి హాని చేయకుండా ఆహారపు గొలుసును కాపాడుకుందామని, అప్పుడే అన్ని జీవాలతో పాటు మానవ మనుగడ సాధ్యమని డా.బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.సదాశివయ్య అన్నారు.

Published : 23 May 2024 03:23 IST

పాములపై భయం పోగొట్టేలా అవగాహన  

పాలమూరు, న్యూస్‌టుడే : ప్రకృతికి హాని చేయకుండా ఆహారపు గొలుసును కాపాడుకుందామని, అప్పుడే అన్ని జీవాలతో పాటు మానవ మనుగడ సాధ్యమని డా.బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.సదాశివయ్య అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవ వైవిధ్యం ప్రాధాన్యం తెలిపేలా మహబూబ్‌నగర్‌ శివారులోని మయూరి పార్కులో అటవీ శాఖ ఆధ్యర్యంలో బుధవారం సాయంత్రం ‘స్నేక్‌ షో’ నిర్వహించారు. ఈ సందర్భంగా డా.సదాశివయ్య వివిధ రకాల సర్పాలను ప్రదర్శించి వాటి ప్రత్యేకతలు తెలిపారు. పాముల వల్ల ప్రకృతికి కలిగే మేలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవవైవిధ్యంపైనే తన మనుగడ ఆధారపడి ఉందన్న విషయాన్ని మానవుడు మరిచిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో 3వేల రకాల పాములుంటే అందులో 20 శాతమే విష సర్పాలని తెలిపారు. తెలంగాణలో 42 రకాల పాములుంటే 7 మాత్రమే విషం కలిగినవని వివరించారు. మహబూబ్‌నగర్‌లో నాగుపాము, చిన్న రక్త పింజర, రక్త పింజర, కట్లపాము వంటి నాలుగు రకాల విష పాములు ఉన్నాయని చెప్పారు. పాములు వాటికవి ఎవరికీ హాని తలపెట్టవని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురై పాములను చంపితే ఆహారపు గొలుసు దెబ్బతిని ప్రకృతిలో జీవవైవిధ్యం లోపిస్తుందని తెలిపారు. పాములు కాటువేస్తే భయభ్రాంతులకు గురికావద్దన్నారు. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో చంద్రయ్య, డిప్యూటీ ఆర్వోలు రాజశేఖర్, కుర్మంతి, సెక్షన్‌ అధికారి రజనీకాంత్, బీట్‌ అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని