logo

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారం

ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

Published : 21 Mar 2023 02:07 IST

ప్రజల సమస్యను వింటున్న కలెక్టర్‌ క్రాంతి

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 109 దరఖాస్తులు రాగా వాటిలో 102 ధరణికి సంబంధించినవి, మిగతావి ఆసరా పింఛన్లవి ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, ఏవో యాదగిరి, పర్యవేక్షకులు రాజు, మదన్‌మోహన్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

యువతలో సామాజిక బాధ్యత పెరగాలి : గద్వాల కలెక్టరేట్‌: యువత చదువుతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించే యువ ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న యూత్‌ రెడ్‌ క్రాస్‌ వాహనాలకు సోమవారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఓ లక్ష్యాన్ని ఎంచుకుని అందులో విజయం సాధించాలన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిలో ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలకు చెందిన అఖిల, హేమంత్‌కుమార్‌, ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన శ్రీవాణి, కీర్తి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంతినగర్‌కు చెందిన శశిధర్‌, మీనాక్షి, ఎస్వీఎం డిగ్రీ కళాశాలకు చెందిన హేమంత్‌కుమార్‌, శివకుమార్‌, సత్యసాయి డిగ్రీ కళాశాలకు చెందిన హిమాజ, నందిని, నాగసాయికుమార్‌ ఉన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ రమేష్‌, ప్రతినిధి శ్రీతేజస్వీ వర్మ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని