logo

విక్రయానికి సేంద్రియ ఎరువు

సేంద్రియ ఎరువు విక్రయానికి పురపాలక సంఘం ఎట్టకేలకు కసరత్తు చేపట్టింది. ‘సేంద్రియం.. అవుతోంది వ్యర్ధం’ శీర్షికన ఈ నెల 24వ తేదీన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన పురపాలక శాఖ పారిశుద్ధ్య విభాగం అధికారులు బుధవారం అంబేద్కర్‌ కూడలిలోని ఎక్స్‌పో ప్లాజాలో 2, 5, 20 కిలోల సేంద్రియ ఎరువు ప్యాకెట్లను విక్రయానికి ఉంచారు

Published : 30 Mar 2023 05:58 IST

2, 5, 20 కిలోల సామర్థ్యంతో ప్యాకెట్ల తయారీ

సేంద్రియ ఎరువు ప్యాకెట్లను విక్రయిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం

పాలమూరు పురపాలకం, న్యూస్‌టుడే : సేంద్రియ ఎరువు విక్రయానికి పురపాలక సంఘం ఎట్టకేలకు కసరత్తు చేపట్టింది. ‘సేంద్రియం.. అవుతోంది వ్యర్ధం’ శీర్షికన ఈ నెల 24వ తేదీన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన పురపాలక శాఖ పారిశుద్ధ్య విభాగం అధికారులు బుధవారం అంబేద్కర్‌ కూడలిలోని ఎక్స్‌పో ప్లాజాలో 2, 5, 20 కిలోల సేంద్రియ ఎరువు ప్యాకెట్లను విక్రయానికి ఉంచారు. కిలో ఎరువు రూ. 20 చొప్పున ధర నిర్ణయించారు. ఎక్స్‌పో ప్లాజాలో విక్రయిస్తున్న వివిధ వస్తువుల కోసం వచ్చిన మహిళలు సేంద్రియ ఎరువు ప్యాకెట్లను కూడా పరిశీలించి తమ ఇళ్లల్లో పూల మొక్కలకు వేసేందుకు కొనుగోలు చేశారు. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో స్వచ్ఛ మషాల్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెప్మా కార్యాలయం నుంచి ఎక్స్‌పో ప్లాజా వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం మహిళల చేత స్వచ్ఛ సర్వేక్షణ్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువు తయారీ, ప్రయోజనాలపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వాణీకుమారి, రవీందర్‌రెడ్డి, గురులింగం స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు ఎక్స్‌పో ప్లాజాలో షాపింగ్‌కు వచ్చిన మహిళలకు అవగాహన కల్పించారు. త్వరలో మెట్టుగడ్డ వద్ద పురపాలక దుకాణ సముదాయంలో సేంద్రియ ఎరువు విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని