logo

సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి

నాగర్‌కర్నూల్‌ సర్కిల్‌ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Published : 23 Apr 2024 03:39 IST

సీఐ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

కందనూలు, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ సర్కిల్‌ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్యాలయాన్ని ఠాణా ఎడమ వైపున ఉన్న భవనంలోకి మార్చామని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తెలిపారు. సోమవారం సీఐ కార్యాలయాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈనెల 22, 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్న సలేశ్వరం జాతర వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 300 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబోస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనపు ఎస్పీ రామేశ్వర్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ భరత్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ కనకయ్య, ఎస్సై గోవర్ధన్‌ పాల్గొన్నారు.

6 ఫిర్యాదులు నమోదు : పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తెలిపారు. భూమి పంచాయతీలకు సంబంధించి 4, ఇతర సమస్యలకు సంబంధించి 2 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో పరిశీలించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని