logo

పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్‌

అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్‌ హాల్‌లో సర్ఫ్‌ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

Published : 24 Apr 2024 06:27 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పాతబస్టాండ్‌(నారాయణపేట), న్యూస్‌టుడే: అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్‌ హాల్‌లో సర్ఫ్‌ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2023-24 సంవత్సరం బ్యాంకు లింకేజీ లక్ష్యం ఎంత? ఇప్పటి వరకు చేరుకున్నది ఎంత అని ప్రశ్నించారు. జిల్లాలోని నలుగురు డీపీఎంలు ప్రతి గ్రామైక్య సంఘాన్ని పరిశీలించి ఆయా సంఘాలలో పొదుపు, అప్పుల వివరాలతో పాటు కార్యక్రమాల నివేదికను వచ్చే నెల 15 లోపు తనకు అందజేయాలని ఆదేశించారు. మక్తల్‌ మండలంలో మొత్తం ఎన్ని గ్రామైక్య సంఘాలు ఉన్నాయని, అందులో ఎంతమంది పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మక్తల్‌, కోస్గి పరిధిలోని సీసీలకు మెమోలు జారీ చేయాలని డీఆర్డీవో రాజేశ్వరికి కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని సీఐఎఫ్‌ రికవరీ ఎందుకు జరగటం లేదని, ముఖ్యంగా మద్దూర్‌ కోస్గి మండలాల్లో చాలా తక్కువగా ఉండటంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ధన్వాడ మండలంలోనూ సీఐఎఫ్‌ రికవరీ చేయకపోతే సీసీలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పాఠశాల కమిటీల ద్వారా చేసిన పనుల బిల్లులను ఎక్కడా స్పీడ్‌ బ్రేకర్లు (ఆపరాదని) సూచించారు. ఇంకా ఎక్కడైనా పనులు చేయాల్సి ఉంటే వెంటనే తీర్మానం చేసి పనులు ప్రారంభించాలన్నారు. అకౌంట్ నిర్వహణ సరిగ్గా ఉండాలా చూసుకోవాలని, ఇది వరకే అన్ని పాఠశాలలకు తాను నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌ గరీమా నరుల, డిప్యూటీ డీఆర్డీవో అంజయ్య, డీపీఎంలు, సీసీలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని