logo

మహబూబ్‌నగర్‌లో 42.. నాగర్‌కర్నూల్‌లో 34 నామపత్రాల దాఖలు..!

పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 42 మంది, నాగర్‌కర్నూల్‌లో 34 మంది నామపత్రాలు సమర్పించారు.

Published : 26 Apr 2024 03:29 IST

చివరి రోజు భారీగా వచ్చిన దరఖాస్తులు

మహబూబ్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేస్తున్న దినేశ్‌.. బీఎస్పీ అభ్యర్థిగా మహ్మద్‌ అల్లాఉద్దీన్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 42 మంది, నాగర్‌కర్నూల్‌లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. చివరి రోజు భారీగా నామపత్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా రిటర్నింగ్‌ కార్యాలయాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు తీసుకున్న అభ్యర్థుల నామపత్రాలు రాత్రి వరకు కొనసాగాయి. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన ఉంటుంది. 29 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు. మే 13న పోలింగ్‌ ఉంటుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారం ఊపందుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని