logo

పది ఫలితాల్లో మెరిసిన బాలికలు

పదో తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. 89.93 శాతం ఉత్తీర్ణులై బాలురు (84.02 శాతం) కంటే పైచేయి సాధించారు.

Published : 01 May 2024 07:00 IST

జిల్లాలో 86.93 శాతం ఉత్తీర్ణత

 వనపర్తి న్యూటౌన్‌, వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే : పదో తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. 89.93 శాతం ఉత్తీర్ణులై బాలురు (84.02 శాతం) కంటే పైచేయి సాధించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 86.93 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. గత ఏడాది కంటే 5.29 శాతం ఎక్కువ ఫలితాలు సాధించారు. మొత్తంగా రాష్ట్రంలో జిల్లా 29వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో నాలుగో స్థానం దక్కింది. జిల్లాలో చిన్నంబావి మండలం 98.95 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలిచింది. 72.88 శాతం ఫలితాలతో అమరచింత మండలం చివరిస్థానంలో నిలిచింది.

 ఫలితాలు ఇలా.. : జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి 3,158 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,470 మంది ఉత్తీర్ణులయ్యారు. 78.21 శాతం ఫలితాలు సాధించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన 594 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 554 మంది పాసయ్యారు. 93.28 శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 132 మంది విద్యార్థుల్లో 71 మంది ఉత్తీర్ణులై 53.79 శాతం ఫలితాలు సాధించారు. ఆదర్శ పాఠశాలలకు చెందిన 274 మంది హాజరుకాగా 253 మంది పాసై 92.34 శాతం ఫలితాలు సాధించారు. ఆశ్రమ పాఠశాలలకు చెందిన 34 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28 మంది ఉత్తీర్ణులై 82.35శాతం ఫలితాలు సాధించారు. బీసీ గురుకులాలకు చెందిన 217 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 217 మంది ఉత్తీర్ణులై వంద శాతం ఫలితాలు సాధించారు. మైనార్టీ గురుకులాలకు చెందిన 178 మంది పరీక్షలు రాయగా 165 మంది ఉత్తీర్ణులై 92.70 శాతం ఫలితాలు సాధించారు. ఎస్సీ గురుకులాలకు చెందిన 381 మంది విద్యార్థులు పరీక్షలు రాసి 362 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 95.01 ఫలితాలు సాధించారు. ఎస్టీ గురుకులాలకు చెందిన 146 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 143 మంది ఉత్తీర్ణులై 97.95 శాతం ఫలితాలు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన 1,773 మంది పరీక్ష రాయగా 1,724 మంది ఉత్తీర్ణులై 97.24 శాతం ఫలితాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని