logo
Updated : 22 Nov 2021 09:14 IST

Suicide: నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ..

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: భర్త లేని లోకంలో నేను ఉండలేనంటూ భార్య బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన చిన్నశంకరంపేటలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ మహ్మద్‌ గౌస్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేటకు చెందిన మల్లేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులే జీవనాధారం. పెద్ద కుమార్తె మహేశ్వరి (26) ఇదే గ్రామానికి చెందిన చిరు వ్యాపారి ముచ్చర్ల రమేష్‌ను ఎనిమిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. వారికి  కుమార్తె తేజస్వి, కుమారుడు అభి ఉన్నారు. 15 రోజుల క్రితం రమేష్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మహేశ్వరి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబీకులతో కలిసి భోజనం చేసి నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి రోజు మాదిరిగానే పాలు తీసుకొద్దామని వెళ్లిన మహేశ్వరి ఉదయం 8 గంటలైనా తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన ఆమె అత్త విజయ విషయాన్ని మహేశ్వరి తండ్రి మల్లేశానికి చెప్పింది. ఆయన అన్ని చోట్ల వెతుకుండగా, మహేశ్వరి చెరువు వైపు వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామం సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి చూడగా ఆమె ద్విచక్ర వాహనం (స్కూటీ), చెప్పులు కనిపించాయి. వెంటనే ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించగా మహేశ్వరి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు. కుమారుడు చనిపోయిన ఘటన మరచిపోయే లోపే కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో రమేష్‌ తల్లి విజయ రోదనలు మిన్నంటాయి. పిల్లల్లిద్దరిని నేనెలా సాకాలిరా దేవుడా అంటూ రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. నాయనమ్మా అమ్మ ఎందుకు లేవడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని వాపోయింది.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని