logo

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

రెండేళ్ల విరామం అనంతరం పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండు వేసవిలో పరీక్షలు

Published : 23 May 2022 02:12 IST

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మెదక్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నంబర్లు వేస్తున్న ఉపాధ్యాయులు

మెదక్‌, న్యూస్‌టుడే: రెండేళ్ల విరామం అనంతరం పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండు వేసవిలో పరీక్షలు నిర్వహిస్తుండడంతో అవసరమైన వసతులు కల్పించారు. ఈనెల 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 11,400 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 648 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో ఒక కెమెరాతో పాటు ప్రహరీ సరిగా లేని ఏడు పాఠశాలల ఆవరణలో మరో సీసీ కెమెరాను బిగించారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌తో పాటు, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని