logo

వాగులో కొట్టుకుపోయి..

వాగులో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి 15 రోజుల తర్వాత శవమై తేలినట్లు మెదక్‌ గ్రామీణ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన

Published : 12 Aug 2022 01:08 IST

15 రోజుల తర్వాత మృతదేహమై తేలి..

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: వాగులో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి 15 రోజుల తర్వాత శవమై తేలినట్లు మెదక్‌ గ్రామీణ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ప్రభాకర్‌ (60) కుటుంబసభ్యులను వదిలిపెట్టి మెదక్‌లో గత 20 ఏళ్లుగా ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల కిందట పనులు చేసేందుకు కూలీలను మాట్లేండుకు ఇదే మండలం మక్తభూపతిపూర్‌కు వెళ్లి వస్తుండగా.. భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మధ్యలోకి రాగానే పుష్పాలవాగులో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఒక్కడే ఉండటంతో విషయం ఎవరికీ తెలియలేదు. ఈ క్రమంలో మల్కాపూర్‌ తండాకు చెందిన పలువురు తమ పొలాలకు వెళ్లగా.. మృతదేహాన్ని గుర్తించారు. గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎస్‌ఐ.. సిబ్బందితో సహా ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అతడి గురించి ఆరా తీయగా.. ప్రబాకర్‌గా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని