logo

భారాస హయాంలో గ్రామాల అభివృద్ధి

భారాస హయాంలో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండలం ముట్రాజిపల్లిలో గంగపుత్ర సంఘం భవనాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు.

Published : 24 Mar 2023 01:14 IST

ముట్రాజిపల్లిలో గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డి తదితరులు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: భారాస హయాంలో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండలం ముట్రాజిపల్లిలో గంగపుత్ర సంఘం భవనాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గ్రామంలో అర్హత ఉన్న గంగపుత్రులకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పోచమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శిచుకున్నారు. సర్పంచి సంజీవులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, ఎంపీపీ రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని