logo

కాళేశ్వరం దేశానికే ఆదర్శం

రాష్ట్రంలో నేడు జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, కాళేశ్వరం నిర్మాణాన్ని ఇతర దేశాల బృందాలు సందర్శించి అద్భుతమంటున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతారెడ్డి అన్నారు.

Published : 08 Jun 2023 02:04 IST

ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతారెడ్డి

చెక్‌డ్యాం వద్ద పూజలు నిర్వహిస్తున్న మదన్‌రెడ్డి, సునీతారెడ్డి, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఇంజనీర్లు

చిలప్‌చెడ్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నేడు జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, కాళేశ్వరం నిర్మాణాన్ని ఇతర దేశాల బృందాలు సందర్శించి అద్భుతమంటున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధి అజ్జమర్రిలో సర్పంచి పరశురాంరెడ్డి, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో మంజీరానదిపై సుమారు రూ.9 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను వారు ప్రారంభించి పూజలు చేశారు. అంతకుముందు బతుకమ్మలతో మహిళలు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. హత్నూర మండలం పల్పానూర్‌ నుంచి కొల్చారం మండలం పైతర వరకు మంజీరాపై రూ.90 కోట్లతో 14చోట్ల చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతున్నామని, అందులో ఆరు పూర్తయ్యాయని, మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయన్నారు. కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని యువత, చిన్నారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎస్‌ఈఈ మల్లయ్య, డీఈఈ శ్రీనివాస్‌, ఎంపీపీ వినోద, గ్రంథాలయ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌, జిల్లాకో-ఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, అత్మకమిటీ డైరెక్టర్లు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌రాంచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని