logo

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

ప్రసిద్ధ వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య...

Updated : 29 Mar 2024 04:57 IST

యంత్రపూజ చేస్తున్న మాధవానంద సరస్వతి

వర్గల్‌, న్యూస్‌టుడే: ప్రసిద్ధ వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య గురుమదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కరకమలములతో గురువారం ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. కాగా అనంతగిరి పల్లి శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి ఉత్సవానికి అంకురార్పణ చేయగా నరసింహమూర్తి, ఉమామహేశ్వర శర్మ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మొదట క్షేత్రంలో యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతా పూజలు, గర్తన్యాసం, యంత్ర మూర్తి ప్రతిష్ఠాపనోత్సవం జరిగింది. ఆలయ నిర్మాణ దాత అనిల్‌ గుప్త, అర్చన గుప్త దంపతులను చంద్రశేఖర శర్మ నేతృత్వంలో ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో సంతాన మల్లికార్జున క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్‌ చెప్పెల హరినాథ శర్మ, కమిటీ సభ్యులు యాయవరం రాజశేఖర శర్మ, దాచేపల్లి వెంకటకృష్ణ, సత్యనారాయణ, ఇర్రి మల్లారెడ్డి, బెజగాం వాసుగుప్త, వేద గురువులు గుండేశ్వర శర్మ, నాగరాజ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠ అనంతరం చంద్రమౌళీశ్వరుడికి పూజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని