logo

కేసీఆర్‌ ఒక్కరే!

గజ్వేల్‌ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్‌ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్‌ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేది.

Published : 28 Apr 2024 03:31 IST

గజ్వేల్‌ నేతగా పార్లమెంటు బరిలో

జ్వేల్‌ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్‌ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్‌ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేది. ఆ తర్వాత పునర్విభజనలో భాగంగా మెదక్‌లో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 18 వరకు ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి రెండు సార్లు విజయం సాధించిన గీతారెడ్డి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా గజ్వేల్‌ నుంచి నేతలెవ్వరూ పార్లమెంటుకు పోటీచేయక పోవడం గమనార్హం. 2014లో గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్‌ ఎంపీగా పోటీ చేసి రెండు చోట్ల విజయాలు సాధించారు. ఆయన ముఖ్యమంత్రి కావటంతో ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి.

న్యూస్‌టుడే, గజ్వేల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని