logo

వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ విమర్శించారు

Published : 08 May 2024 02:35 IST

కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌

మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌, సతీశ్‌కుమార్‌, రవీందర్‌రావు తదితరులు

 హుస్నాబాద్‌, కోహెడ, కోహెడ గ్రామీణం: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ విమర్శించారు. మంగళవారం కోహెడలో భారీ వర్షం కారణంగా కార్నర్‌ మీటింగు రద్దు చేసిన అనంతరం మాజీ శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ టి.రవీందర్‌రావు, భారాస రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరెంటు, నీళ్లు లేక గ్రామీణ ప్రాంత రైతులకు ఇచ్చిన సౌకర్యాలు కుంటుపడ్డాయన్నారు. రైతులు భూములు వదలి పట్టణాలకు వెళ్లి కూలీ పని చేసుకునే పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి కల్పించారని ఆరోపించారు.  దేవుడిని రాజకీయాలకు వాడుకున్న అంశంపై కోర్టులో కేసు వేయవచ్చన్నారు.

 ‘అంతర్గతంగా భాజపాకు మంత్రి మద్దతు’.. రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అంతర్గతంగా భాజపాకు మద్దతు తెలుపుతున్నట్లు తమకు అనుమానంగా ఉందని మాజీ శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌తోనే అందరికీ న్యాయం

వర్గల్‌, ములుగు, న్యూస్‌టుడే: ములుగు, వర్గల్‌ మండలాల్లో మంగళవారం మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో వంటిమామిడి, తునికి బొల్లారం, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, ములుగులో కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్‌ షోలో భాగంగా మామిడ్యాలలో గిరిజన మహిళలతో కలిసి నీలం మధు నృత్యం చేశారు. నాయకులు శ్రీనివాస్‌, సలీం, కడపల్ల కృష్ణారెడ్డి, రమేశ్‌రెడ్డి, కుంట్ల లక్ష్మారెడ్డి, పోషిరెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, ఎడ్ల పోచయ్య, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.్య అందరికీ అందుబాటులో ఉండి మెదక్‌ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని నీలం మధు అన్నారు. ములుగు, వర్గల్‌ కార్నర్‌ మీటింగ్‌లలో మాట్లాడారు. ఇందిరమ్మ ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు తెచ్చి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. వర్గల్‌ మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ముదిరాజులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నానపురం నర్సింలు, శ్రీరామ్‌, నర్సింలు పాల్గొన్నారు.

భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

ఎన్నికలు కాగానే భూ నిర్వాసితుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని మామిడాల, బైలంపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదన్నారు. బైలంపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన భారాస సీనియర్‌ నేత ఐలయ్య యాదవ్‌ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు