logo

మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు

మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది.

Published : 10 May 2024 01:14 IST

నిందితుడు పఠాన్‌ ఫారుఖ్‌

దౌల్తాబాద్‌, తొగుట, న్యూస్‌టుడే: మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. దౌల్తాబాద్‌ ఎస్సై ప్రేమ్‌దీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలోని అహ్మద్‌నగర్‌కు చెందిన షేక్‌ వలీఖాన్‌(60)కు కుమార్తె అమీర్‌బీ, కుమారుడు షేక్‌ పఠాన్‌ ఫారుఖ్‌(35) సంతానం. కుమార్తెను అదే గ్రామానికి చెందిన షాదుల్లాకి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడికి జకీరా బేగంతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. తండ్రితో కలిసి కలప వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పటాన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఫారుఖ్‌ మద్యానికి బానిసై తరచూ ఆ మత్తులో భార్యా పిల్లలను కొట్టేవాడు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మద్యం తాగి ఇంటికొచ్చాడు. నీ తీరు సరిగా లేదు, మార్చుకోవాలని తండ్రి హితవు పలికాడు. మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఇంట్లో ఉన్న చాకుతో తండ్రిని కడుపు, జబ్బ, కాలుపై చాకుతో పొడిచాడు. కుటుంబ సభ్యులు వారించేలోపే దాడికి తెగబడ్డాడు. అరుపులకు ఇరుగుపొరుగు వచ్చేసరికి వలీ ఖాన్‌ తీవ్రగాయాలతో రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. కారులో గజ్వేల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గం మధ్యలోనే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. వలీఖాన్‌ భార్య అఫ్జల్‌బీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్వేల్‌ ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు పఠాన్‌ ఫారుఖ్‌ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు