logo

గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి

ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం.

Updated : 10 May 2024 06:14 IST

సినిమా పోస్టర్‌

ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. వికారాబాద్‌కు చెందిన నర్సింగ్‌రావు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఆయన గురువు దోరవేటి చెన్నయ్య డైలాగ్‌లు, పాటలు రాశారు. ఈ చిత్రం శుక్రవారం 5 రాష్ట్రాల్లో విడుదల కానుండటం విశేషం.

శిష్యుడి కోరికతో..: వికారాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన దోరవేటి చెన్నయ్య కేవలం పిల్లలకు పాఠాలు బోధించడమే కాకుండా ఆటలు, పాటలు, చిత్రలేఖనం, లలిత సంగీతం, నృత్యం ఇలా ఆయనకు తెలిసిన అంశాల్లో తర్ఫీదు ఇస్తుండేవారు. ఆయన దోరవేటి కలం పేరిట రచనలు చేశారు. కవిగా, రచయితగా పేరు సంపాదించుకున్నారు. కొన్నాళ్లు ఇక్కడ పని చేశాక ఉద్యోగరిత్యా హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో ఒక రోజు తన వద్ద చదువుకున్న వికారాబాద్‌కు చెందిన నర్సింగ్‌రావు కలిశారు. వారిద్దరి మాటల్లో సినిమా దర్శకత్వం గురించి చర్చకు వచ్చింది. ఇలా నర్సింగ్‌రావు ఆయకు కథ గురించి చెప్పడంతో చెన్నయ్య డైలాగ్స్‌, పాటలు రాయడానికి పచ్చజెండా ఊపారు. ఇలా శిష్యుడి కోరికతో సినిమాకు మాటలు, పాటలు రాశారు. ఇలా వారిద్దరి ప్రయాణమే కథాంశంగా బ్రహ్మచారి సినిమా తెరకెక్కింది.

చెన్నయ్య మరో శిష్యుడైన బి.రాంభూపాల్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత కాగా, హీరోగా మల్లేశం నటించారు. నర్సింగ్‌రావు వికారాబాద్‌ పాతగంజ్‌లో నివాసం ఉండేవారు. తండ్రి సుదర్శన్‌ టైలరింగ్‌ పని చేసేవారు. తల్లి మంగమ్మ గృహిణి. కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దోరేవేటి చెన్నయ్య వికారాబాద్‌ మండలం గొట్టిముక్ల గ్రామం. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు