logo

ఓటు పవిత్రమైనది

ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి.

Published : 10 May 2024 01:25 IST

మురళీధర్‌గౌడ్‌, సినీ నటుడు

ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలి. అభివృద్ధికి పాటుపడే వారికే మద్దతు తెలపండి. ముఖ్యంగా యువత, మేధావులు ఆలోచించాలి. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు గడప దాటుదాం. ప్రలోభాలకు దూరంగా ఉందాం. పారదర్శకంగా ఓటేయాలి. తప్పనిసరిగా ఓటేస్తేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నట్లు. ఇప్పుడు వేసే ఓటు ఐదేళ్ల అభివృద్ధికి నాందిగా ఉండాలి. శతశాతం ఓటింగ్‌ జరిగేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. మే 13న సెలవు దినంగా భావించకుండా బాధ్యతగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి.

చేగుంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు