logo

మాట ఆగింది.. మీట పిలుస్తోంది

నల్గొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్‌కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు

Published : 12 May 2024 03:11 IST

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నల్గొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్‌కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. మద్యం దుకాణాలు మూసివేశారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సామగ్రి పంపిణీకి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే రెండు దశల్లో రాజకీయ నాయకులు సమక్షంలో ఈవీఎంలకు యాదృచ్ఛికీకరణ పూర్తిచేశారు. వాటిని ఆయా నియోజకవర్గాల్లోని గోదాముల్లో భద్రపరిచారు. ఈ నెల 13న చేపట్టే పోలింగ్‌ కార్యక్రమానికి ఆదివారం సామగ్రి పంపిణీకి పీవోలు, ఏపీవోలు ఆయా గోదాములకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. వారు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులు కేటాయించారు.  జిల్లాలో పోలైన ఓట్లను లెక్కించడానికి నల్గొండలోని అనిశెట్టి దుప్పలపల్లిలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలను తరలించే వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు నియోజకవర్గాలకు 113 రూట్లు, 123 సెక్టార్‌ అధికారులను నియమించారు.

48 గంటల పాటు 144 సెక్షన్‌

 జిల్లాలోని 1201 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరిపేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు 48 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు కార్యాచరణ రూపొందించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు