logo
Published : 27/11/2021 05:15 IST

ఆదర్శ సమాజ నిర్మాణమే భారత రాజ్యాంగ లక్ష్యం: అదనపు కలెక్టర్‌

సూర్యాపేట: ప్రతిజ్ఞ చేస్తున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, తదితరులు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అసమానతలు, వివక్ష లేని ఆదర్శ సమాజ నిర్మాణమే భారత రాజ్యాంగ లక్ష్యమని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. స్వేచ్ఛ, సమాన్వతం, సమన్యాయం పునాదులుగా భారత రాజ్యాంగం జాతిజనులకు రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఏడీఏ రామారావునాయక్‌, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, సంక్షేమశాఖల అధికారులు శిరీష, శంకర్‌, దయానందరాణి, ఏవో శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌: కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. అనంతారంలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం తేమశాతం ఉన్న ధాన్యాన్ని కాంటా వేసిన వెంటనే రైతుల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవల ఇక్కడి కొనుగోలు కేంద్రంలోని సీసీ కెమెరాల వైర్లు తొలగించి ధాన్యాన్ని దొంగిలించారనే ఆరోపణలపై ఆరాతీశారు. దీనిపై విచారణ జరపాలని ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ను ఆదేశించారు. పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాతాల జానకిరాంరెడ్డి, పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి, వైస్‌ఛైర్మన్‌ మామిడి శ్రీనివాస్‌, సీఈవో సైదులు, ఏఈవో సుష్మ, మామిడి పరంధాములు, రాంరెడ్డి, బక్కయ్య పాల్గొన్నారు.

సూర్యాపేటలో మాట్లాడుతున్న ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌

సూర్యాపేట(జమ్మిగడ్డ): పౌరులందరూ రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో సూర్యాపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి ఆర్పించారు. పురపాలిక ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ ఛైర్మన్‌ పుట్టా కిశోర్‌, తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని