logo
Published : 29/11/2021 02:02 IST

స్తంభోద్భవుడి సన్నిధిలో కోలాహలం

బాలాలయంలో నిత్య కల్యాణ క్రతువులో భక్తులు

యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయ పరిసరాల్లో భక్తజనుల సందోహం నెలకొంది. శ్రీ లక్ష్మీనారసింహుల దర్శనం, ప్రసాదాల కొనుగోలుకు గంటలకొద్దీ వరుసలో నిల్చోవాల్సి వచ్చిందని భక్తులు చెప్పారు. వేకువజామున 3 గంటలకే పూజారులు బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులను మేల్కొలిపి హారతి నివేదన జరిపారు. నిత్య కైంకర్యాలలో భాగంగా ఉత్సవమూర్తులను కొలుస్తూ నిజాభిషేకం, తులసీ అర్చన నిర్వహించారు. దర్శనమూర్తులను సువర్ణ పుష్పాలతో ఆరాధించారు. వేదమంత్రోచ్చరణలతో అష్టోత్తరం కొనసాగింది. ఆలయ మండపంలో యాజ్ఞికులు శ్రీ సుదర్శన నారసింహహోమం జరిపాక పూజారులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం శ్రీస్వామి అమ్మవారల నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తజనులు తమ కుటుంబ సంక్షేమాన్ని ఆశిస్తూ కొండ కింద పాతగోశాల చెంత శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు చేపట్టారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ నిత్యారాధనలు, కల్యాణోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని