logo
Published : 02/12/2021 06:13 IST

బీఎస్పీతోనే మార్పు సాధ్యం: ప్రవీణ్‌కుమార్‌

అయిటిపాములలో రిక్షా తొక్కుతున్న ప్రవీణ్‌కుమార్‌

కట్టంగూరు, న్యూస్‌టుడే: బహుజన సమాజ్‌ పార్టీతోనే మార్పు సాధ్యమని పార్టీ రాష్ట్ర  కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కట్టంగూరులో పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం అయిటిపాములలో ఇటీవల మృతి చెందిన తోటకూరి సతీష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయిటిపాముల వీధుల్లో కాసేపు రిక్షా తొక్కారు. కట్టంగూరులో కాసేపు ఆటో నడిపారు.
నకిరేకల్‌: వచ్చే సీజన్‌లో వరిసాగు చేయవద్దని పోలీసులు, వ్యవసాయ అధికారులతో ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. నకిరేకల్‌ చీమలగడ్డ వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారి అండర్‌ పాస్‌ వంతెన రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడి ప్రియదర్శిని పాల్గొన్నారు.

‘ఓట్లు’.. సీట్లు మావే
మోతె: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకమై ‘ఓట్లు మావే.. సీట్లు మావే’ అనే నినాదంతో ప్రతి గడపకు బహుజన సమాజ్‌ పార్టీని తీసుకెళ్లాలని రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గమధ్యలో మోతెలో ఆగి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి విలేకరులతో మాట్లాడారు. స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు రాము, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దశరథ, శివ పాల్గొన్నారు.



 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని