logo
Published : 04/12/2021 04:54 IST

శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం


పొడిచేడులో శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి,
ఎమ్మెల్యేలు గొంగిడి సునీత,
పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, తదితరులు

మోత్కూరు, న్యూస్‌టుడే: తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన ప్రాణత్యాగమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులోని ఆయన విగ్రహానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి శుక్రవారం నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం మహాసముద్రంలా మారిన విషయాన్ని గుర్తు చేశారు. బంగారు తెలంగాణలో భావితరాలను భాగస్వామ్యం చేయడమే అమరవీరులకు సరైన నివాళి అని అభిప్రాయపడ్డారు. అమరుల ఆశయ సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందని ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ కేసీఆర్‌ తనకు తండ్రిలాంటి వారని, ప్రాణం ఉన్నంతవరకు తెరాసలోనే ఉంటానన్నారు. పొడిచేడు అభివృద్ధికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ మందుల సామేల్‌, సర్పంచి పేలపూడి మధు, మోత్కూరు పురపాలిక అధ్యక్షురాలు తీపిరెడ్డి సావిత్రి, విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి, జడ్పీటీసీ సభ్యురాలు గోరుపల్లి శారద, వైస్‌ ఎంపీపీ పి.లక్ష్మి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కె.యాకూబ్‌రెడ్డి, టి.మేఘారెడ్డి, మహేంద్రనాథ్‌, తెరాస నాయకులు పి.రమేష్‌, బి.కళ్యాణ్‌, కె.సోంమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని