logo

కొవిడ్‌ వ్యాప్తిపై అప్రమత్తత అవసరం: కలెక్టర్‌

కొవిడ్‌ కేసులు విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి కోరారు.

Published : 22 Jan 2022 05:53 IST


ముకుందాపురంలో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

ముకుందాపురం (మునగాల గ్రామీణం), న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం ఇంటింటికి జర్వ సర్వేను మునగాల మండలం ముకుందాపురంలో పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటమన్నారు. కొవిడ్‌ లక్షణాలుంటే వెంటనే వారికి మెడికిల్‌ కిట్టు అందజేయాలని, అవసరమైతే క్వారంటైన్‌ కేంద్రానికి తరలించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పల్లెప్రకృతివనం, నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచి పందిరి కళావతి, ఉపసర్పంచి నాగేశ్వరరావు, వైద్యాధికారి యాదా రమేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మద్దిరాల: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా పోలుమళ్లలో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ శుక్రవారం పరిశీలించారు. ఎంపీడీవో సరోజ పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌లో ఇంటింటి జ్వర సర్వేను జిల్లా అధికారిణి జయా పరిశీలించారు. వైద్యాధికారి నాగేందర్‌, గజగంటి ప్రభాకర్‌, ఇందిరాల రామకృష్ణ పాల్గొన్నారు.

260 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

సూర్యాపేట (తాళ్లగడ్డ): సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 3,160 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 260 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు జిల్లాలో 980 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని