logo

రైతు శ్రేయస్సుపై దృష్టి పెట్టండి

మోది ప్రభుత్వం మోసపూరిత ఆలోచనలతో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను అన్నదాతల నిరసనలతో రద్దు చేసినా.. వాటిని మరో రూపంలో అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 27 Jan 2023 06:30 IST

జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ల ర్యాలీలో వక్తలు

మద్దతు ధరల చట్టం తేవాలని నల్గొండలో రైతు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మోది ప్రభుత్వం మోసపూరిత ఆలోచనలతో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను అన్నదాతల నిరసనలతో రద్దు చేసినా.. వాటిని మరో రూపంలో అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. పండించిన పంటలకు మద్దతు ధర చట్టం, రైతు విమోచన చట్టం, విద్యుత్‌ సంస్కరణల చట్టాలను రద్దు చేసి, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు యోచన ఆపాలనే డిమాండ్‌తో రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్గొండలో ట్రాక్టర్లకు జాతీయ జెండాలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమై పట్టణ వీధుల గుండా మేకల అభినవ్‌ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలతో వ్యవసాయ రంగం నిర్వీర్యమై రైతులు మరింత నష్టపోతారన్నారు. కేంద్రం రైతు, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. విద్యుత్‌ ప్రయివేటీకరణ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం పథకాలు అమలు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, ఏక కాలంలో రుణ మాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, జిల్లా నాయకులు ఆశోక్‌రెడ్డి, వెంకటరమణరెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, హాషం, నాగార్జున, ప్రభావతి, సలీం, తుమ్మల పద్మ, నల్లపురాజు సైదులు, బొల్లు రవి, పోలా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ గడియారం సెంటర్లో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు