విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పొట్టకూటి కోసం వచ్చిన ఓ విద్యుత్తు కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందగా... మరొకరికి గాయాలైన ఘటన మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది.
మరొకరికి గాయాలు
మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం వచ్చిన ఓ విద్యుత్తు కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందగా... మరొకరికి గాయాలైన ఘటన మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది. ఏఈ కిషన్‌లాల్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామశివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంపు విద్యుత్తు పనులు చేయించేందుకు ఓ గుత్తేదారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏడుగురు విద్యుత్తు కార్మికులను తీసుకొచ్చారు. సదరు గుత్తేదారు విద్యుత్తు అధికారులతో మాట్లాడి ఎల్‌సీ తీసుకుని విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. విద్యుత్తు పనులు చేసేందుకు భదాద్రి-కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన విద్యుత్తు కార్మికుడు కొరం బొజ్య(40), ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన గౌరాజు కృష్ణ మరో కార్మికుడు వీరస్వామి స్తంభం పైకి ఎక్కారు. పనిచేస్తుండగా... విద్యుత్తు సరఫరా కావడంతో బొజ్య, కృష్ణ విద్యుదాఘాతానికి గురై కింద పడ్డారు. బొజ్య అక్కడిక్కడే మృతి చెందగా, కృష్ణకు గాయాలయ్యాయి. ఎల్‌సీ ఇవ్వడంలో సరైన నిబంధనలను పాటించకపోవడం వలనే విద్యుదాఘాతానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఏఈ కిషన్‌లాల్ తెలిపారు. బొజ్యకు భార్య, పదిహేళ్ల కుమార్తె ఉన్నారని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!