ప్రకటించేశారు.. పరిహారం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పాటూ ఉత్తర్వులూ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 10,988 మంది బాధిత రైతులకు కొంత ఊరట లభించినట్లైంది.
సీఎం హామీతో పంట నష్టపోయిన రైతులకు ఊరట
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరిపైరు
ఈనాడు, నల్గొండ : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పాటూ ఉత్తర్వులూ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 10,988 మంది బాధిత రైతులకు కొంత ఊరట లభించినట్లైంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పంటనష్టం వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ప్రకారం వరి, మామిడితో పాటూ అన్ని పంటలు కలిపి అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాలు, నల్గొండలో 1060 ఎకరాలు, యాదాద్రిలో 7643 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తేల్చారు. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలో 23,132 ఎకరాలకు ప్రభుత్వం రూ.23.1 కోట్లను పరిహారంగా చెల్లించనుంది. అయితే మొత్తం పంటనష్టం రూ.100 కోట్ల వరకు ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఏటా ఈ సీజన్‌లో వచ్చే అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గడంతో పాటూ ఏటా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గత ఐదేళ్లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడం ఉమ్మడి జిల్లాలో ఇదే ప్రథమం. అధికారులు అత్యధికంగా నష్టపోయిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేశారని, 50 శాతం కంటే తక్కువగా నష్టపోయిన వివరాలను నమోదు చేయలేదని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వానల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, తమకూ న్యాయం చేసేలా అధికారులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.
వరి పంటకే ఎక్కువ నష్టం
మూడు జిల్లాల్లోనూ ఈ అకాల వర్షాల వల్ల అత్యధిక నష్టం వరి పంటకే జరిగింది. 10,988 మంది రైతులకు సంబంధించి 23 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే అందులో 20 వేల ఎకరాలు కేవలం వరి పంటనే కావడం గమనార్హం. పంట దెబ్బతిన్న రైతులకు నాలుగైదు రోజుల్లో పరిహారం ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి వీటిని పంపిణీ చేయనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు