logo

పండుటాకులకు ఇంటివద్దే ఓటు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం  పలు చర్యలు చేపట్టింది.

Published : 20 Apr 2024 04:57 IST

దరఖాస్తుల సేకరణ ప్రారంభం

గత అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధుడితో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయిస్తున్న దృశ్యం

 భువనగిరి, న్యూస్‌టుడే: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం  పలు చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారికి ఈ అవకాశం కల్పించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్లకు పెంచారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ వ్యాప్తంగా 10,945 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,585 మంది మహిళలు కాగా 4,359 మంది పురుషులు ఉన్నారు. గుర్తించిన ఈ వృద్ధ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం-12డీని బీఎల్‌వోలు జారీ చేశారు. గురువారం నుంచి ఇచ్చిన దరఖాస్తు ఫారాలను బీఎల్‌వోలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 23లోపు వీటిని సేకరిస్తారు. ఈ నెల 24న దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. 25న రూట్‌మ్యాప్‌ రూపొందిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఓటర్ల సంఖ్యను బట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గానికి మూడు చొప్పున బృందాలను ఏర్పాటు చేసి వృద్ధ ఓటర్ల నుంచి పోస్టల్‌ బ్యాలెట్లను స్వీకరించారు. వారి ఇంటి వద్దకే వెళ్లి బ్యాలెట్‌ పత్రాలు ఇచ్చి ఓటు వేయించుకుంటారు. ఏఆర్‌వోల పర్యవేక్షణలో మే 3 నుంచి 6 వరకు బృందాలు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌లను తీసుకుంటారు. ఆ బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారని పోస్టల్‌ బ్యాలెట్‌ల నోడల్‌ అధికారి శేఖర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని