logo

సీ విజిల్‌లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్‌ యాప్‌లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్‌పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

Published : 26 Apr 2024 04:24 IST

రాయగిరిలో ఫ్లాగ్‌మార్చ్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే, డీసీపీ రాజేష్‌చంద్ర, పోలీసులు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్‌ యాప్‌లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్‌పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. డీసీపీ రాజేష్‌చంద్ర, భువనగిరి ఆర్డీవో అమరేందర్‌ ఫ్లాగ్‌ మార్చ్‌ పాల్గొన్నారు. రాయగిరి ప్రధాన రహదారి నుంచి కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. డీసీపీ రాజేష్‌చంద్ర మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడే పార్టీలు, నాయకులపై భయపడకుండా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించే బృందాలు ఉన్నాయని వివరించారు. ఫ్లాగ్‌ మార్చ్‌లో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్‌, ఏఆర్‌ పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని