logo

జోజిలపాస్‌ను అధిరోహించిన దేవరకొండ వాసి

అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్‌కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్‌. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్‌ సలాం, ఖుర్షీద్‌భేగంలు.

Updated : 26 Apr 2024 06:31 IST

జాతీయ జెండాతో అజీజ్‌

దేవరకొండ, న్యూస్‌టుడే: అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్‌కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్‌. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్‌ సలాం, ఖుర్షీద్‌భేగంలు. అజీజ్‌ స్థానికంగా దేవరకొండ పట్టణంలో ఓ ఇంటర్నెట్‌ కేబుల్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఈనెల 19న దేవరకొండ పట్టణం నుంచి బైక్‌పై బయలుదేరి 2600 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాకిస్థాన్‌ బోర్డర్‌కు ఉత్తరాన, చైనా బోర్డర్‌కు తూర్పున లద్దాక్‌ ప్రాంతంలో ఉండే 11,649 అడుగుల అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని జోజీలపాస్‌కు సాహసోపేతాల మధ్య చేరుకున్నాడు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని జీరో పాయింట్‌ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఎత్తయిన పర్యాటక ప్రాంతాలు అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అజీజ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని