logo

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకరణ

సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సింగిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు.

Published : 01 May 2024 06:03 IST

గోవర్ధన్‌రెడ్డి

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సింగిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఈయన 1994లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. 2003లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తిగా, 2013లో జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తొలుత నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా, 2015లో వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి నిజామాబాద్‌ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. 2022లో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇన్నాళ్లు ఇక్కడ జిల్లా న్యాయమూర్తిగా పనిచేసిన జి.రాజగోపాల్‌ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని