logo

నల్గొండ డయాసిస్‌ బిషప్‌గా బాధ్యతలు స్వీకరణ

 ఏసు ప్రభువు సేవలో కొనసాగేందుకు దేవుడు కల్పించిన వరంలా భావిస్తూ నల్గొండ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్నానని నూతన బిషప్‌ కరణం ధమన్‌కుమార్‌ తెలిపారు.

Published : 01 May 2024 06:13 IST

కార్డినల్‌ పూల ఆంథోని, ఇతర బిషప్‌ల సమక్షంలో నల్గొండ నూతన పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కరణం ధమన్‌కుమార్‌

నీలగిరి, న్యూస్‌టుడే: ఏసు ప్రభువు సేవలో కొనసాగేందుకు దేవుడు కల్పించిన వరంలా భావిస్తూ నల్గొండ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్నానని నూతన బిషప్‌ కరణం ధమన్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం నల్గొండలోని సెయింట్‌ ఆల్ఫోన్స్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన పవిత్రాభిషేక కార్యక్రమంలో ఆయన కార్డినల్‌ పూల ఆంథోని, భారత్‌, నేపాల్‌ పోప్‌ ప్రతినిధి, ఇతర బిషప్‌ల సమక్షంలో పీఠాధిపతిగా అభిషేకం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ జనులందరు  సంతోషంగా ఉండేలా నిత్యం ప్రభువు సన్నిధిలో ప్రార్థనలు జరిపిస్తానన్నారు. నల్గొండ డయాసిస్‌ పరిధిలో నిరంతరం దైవ కార్యాలు జరిపిస్తూ తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి ఎలాంటి కళంకం రాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. ఈ అవకాశం కల్పించిన పోప్‌నకు, సహకరించిన దైవ జనులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భారత్‌, నేపాల్‌ పోప్‌ ప్రతినిధి, కార్డినల్‌, హైదరాబాద్‌ ఆర్చి బిషప్‌ పూల ఆంథోని, విశ్రాంత బిషప్‌ గోవిందు జోజి, తెలుగు రాష్ట్రాల బిషప్‌లు, మత గురువులు, సిస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని