logo

ఉదయం 7 గంటలకే పని ప్రదేశంలో ఉండాలి

ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 7 గంటల వరకే కూలీలు పని ప్రదేశంలో ఉండాలని ఉపాధిహామీ రాష్ట్ర చీఫ్‌ విజిలెన్స్‌ అధికారిణి కె.ఉషా కోరారు.

Published : 01 May 2024 06:17 IST

నకిరేకల్‌: నోములలో కూలీలతో మాట్లాడుతున్న  చీఫ్‌ విజిలెన్స్‌ అధికారిణి ఉషా

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 7 గంటల వరకే కూలీలు పని ప్రదేశంలో ఉండాలని ఉపాధిహామీ రాష్ట్ర చీఫ్‌ విజిలెన్స్‌ అధికారిణి కె.ఉషా కోరారు. మండలంలోని నోములలో పని ప్రదేశాన్ని మంగళవారం సందర్శించి కూలీలతో మాట్లాడారు. నీడ, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స పెట్టెలను పని ప్రదేశంలో విధిగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కూలీలకు ఎక్కువ మొత్తంలో వేతనం అందేవిధంగా క్షేత్ర సహాయకులు మార్కింగ్‌లు ఇచ్చి పనులు చేయించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, ఏపీడీ నవీన్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఏపీవో రమణయ్య, ఈసీ స్వాతి, టీఏలు రమణ, రమేశ్‌ పాల్గొన్నారు.

కట్టంగూరు: కట్టంగూరు చెరువులో జరుగుతున్న పూడిక తీత పనులను గ్రామీణ ఉపాధిహామీ పథకం చీఫ్‌ విజిలెన్సు ఆఫీసర్‌ కె.ఉష మంగళవారం తనిఖీ చేసి, మస్లర్‌, కూలీల హాజరును పరిశీలించారు. ఏపీడీ బీఎల్‌ఎన్‌రావు, ఎంపీడీవో జ్ఞానప్రకాశ్‌రావు, ఏపీవో రామ్మోహన్‌, ఈసీ శ్రీధర్‌, క్షేత్ర సహాయకురాలు నిర్మల ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని