logo

మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం

మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది.

Published : 10 May 2024 06:42 IST

దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రం

దేవరకొండ, న్యూస్‌టుడే: మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. దేవరకొండ డివిజన్‌లో గత ఏడాది డయాలసిస్‌ కేంద్రంలో 20 మంది ఉండగా, ప్రస్తుతం రోగుల సంఖ్య 50కి చేరుకుంది. ఇందులో మారుమూల గుట్టల ప్రాంతమైన ఉమ్మడి చందంపేట మండల వాసులే అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

కారణాలు ఇవే

 ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మైనింగ్‌, క్రషర్‌ మిల్లులు దేవరకొండ డివిజన్‌లో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతేడాది 500 మంది రోగులు చికిత్స నిర్వహించుకుంటే ప్రస్తుతం ప్రతి నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 700 మందికి పైగా డయాలసిస్‌ చేయించుకుంటున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. నీరు కలుషితంగా మారడంతో పాటు దుమ్ము, ధూళి ద్వారా చిన్న చిన్న రేణువులు పీల్చడం వల్ల బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. వీటికి తోడు గట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఫ్లోరోసిస్‌ శాతం అధికంగా ఉన్న నీటిని తాగుతున్నారు.


రోగుల సంఖ్య పెరుగుతుంది:
డాక్టర్‌ రాములునాయక్‌, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌

దేవరకొండలోని డయాలసిస్‌ కేంద్రానికి ఉమ్మడి చందంపేట మండలం నుంచి రోగులు అధికంగా వస్తున్నారు. వారికి భోజనంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. గత ఏడాదిలో రోగుల సంఖ్య 20 మంది ఉంటే ప్రస్తుతం 50కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని