logo

పోరాట యోధుడు.. పుచ్చలపల్లి

ప్రజల సమస్యలపై పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన స్ఫూర్తిని కార్యకర్తలు కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. సుందరయ్య వర్ధంతి గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలో

Published : 20 May 2022 01:44 IST


మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

 

నెల్లూరు(విద్య), గుడ్లూరు, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలపై పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన స్ఫూర్తిని కార్యకర్తలు కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. సుందరయ్య వర్ధంతి గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని కనకమహల్‌ సెంటర్‌లో సుందరయ్య విగ్రహానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు వివిధ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు రాజకీయాలు వ్యాపారమయం అయిపోయాయని, ఓట్లను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోకుండా కార్పొరేట్‌కు దాసోహమైందని తెలిపారు. చట్టాలను తుంగలో తొక్కుతూ ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగిన వర్ధంతి సభలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. బాలాజీనగర్‌లోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు, కాయం శ్రీనివాసులు, పి.సుబ్రమణ్యం, టి.దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. మండలంలోని చేవూరులో సీపీఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. స్థానిక శాఖ బాధ్యులు ఇరువూరి బ్రహ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, నూతలపాటి వెంకటేశ్వర్లు, రాజగోపాల్‌, కృష్ణమూర్తి, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని