logo

వైకాపా నాయకుల చేతివాటం

సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి.

Published : 24 Apr 2024 04:35 IST

ఈ చిత్రం పట్టణంలోని 23వ వార్డులో ఇటీవల నిర్మించిన సిమెంట్‌ రోడ్డు. నాసిరకం కంకర వాడుతున్నారు. సిమెంట్‌ తక్కువగా వినియోగిస్తున్నారు. క్యూరింగ్‌ కూడా సరిగా చేయడం లేదు. పర్యవేక్షణ చేసే సచివాలయాల ఇంజినీరింగ్‌ సిబ్బందికి ఇవి కానరాకపోవడం గమనార్హం.

కావలి, న్యూస్‌టుడే: సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన వినతుల మేరకు ఒక్కో సచివాలయానికి రూ. 40 లక్షల వంతున నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎన్నికల నియమావళి వచ్చే లోపు పట్టణంలోని అన్ని వార్డుల్లో తమకు నచ్చిన నాయకులకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు నిర్మిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా పనులు

ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న పనులు చూస్తే నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా చేస్తున్నారు. ఇందుకు ముందుగానే అనుమతులు తీసుకున్నారు. నిర్మాణ దశలోనే చోటుచేసుకుంటున్న లోపాలకు అతుకులు వేసి కప్పిపుచ్చుతున్నారు. భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు తనిఖీ క్యూబులు వేయాల్సి ఉంది. పర్యవేక్షక, నాణ్యత, నియంత్రణ అధికారులు వీటిపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇవి క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.


నియమావళికి ముందే ఆర్డర్లు
సాయిరాం, డీఈ, కావలి పురపాలకం

సచివాలయాల పరిధిలో ఎన్నికల నియమావళి వచ్చేలోపు వర్క్‌ ఆర్డర్లు విడుదల చేశాం. నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. అక్కడక్కడా తప్పులున్నా సరిచేయిస్తాం. నిబంధనలు అమలుచేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని